మెగా స్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు మెగా స్టార్ మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన చిత్రంలో కూడా విలన్ గా నటిస్తున్నారు. మరో వైపు అల్లుఅర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే నటుడిగా మంచిపేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయట.
కానీ అతని కండిషన్స్ మాత్రం నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయట. విజయ్ ఒక్కో సినిమాకు 8 కోట్ల రెమ్యునిరేషన్ తీసుకోగా.. తను తెలుగులో నటించిన సినిమాలను తమిళనాడులో విడుదల చేయకూడదని షరతు పెడుతున్నాడట. ఈ షరతులకు అంగీకరించకపోవడం వల్లే `పుష్ప` నుంచి విజయ్ తప్పుకున్నాడని సమాచారం.