తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి డిఫరెంట్ కథ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తు తన మార్కును చూపిస్తున్నాడు. అయితే తాజాగా హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు విజయ్ సేతుపతి పచ్చజెండా ఊపాడు.
ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో కలిసి విజయ్ సేతుపతి నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ కోసం విజయ్ సేతుపతి 55 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగినట్లు సమాచారం. షాహిద్ కు 40 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకున్నప్పటికి విజయ్ సేతుపతి మాత్రం అంతకన్నా ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడట. విజయ్ సేతుపతి ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్న దాఖలాలు కూడా లేవని తెలుస్తుంది. కానీ ఈ వెబ్ సిరీస్ కి మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట.