తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. తెలుగులోనూ ఈ మధ్య క్రమంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్నాడు. కీలక పాత్రల్లో మెప్పిస్తూ… అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఉప్పెన సినిమాలో విలన్ రోల్‌లో నటిస్తున్న విజయ్ సేతుపతి… ఆ తర్వాత బన్సీ-సుకుమార్ కాంభినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ విలన్‌గా నటిస్తాడన్న ప్రచారం జరిగింది.
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగే గందపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే చిత్రం కావటం, తమిళంలోనూ రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో… విజయ్ సేతుపతిని తీసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే… ఇప్పటి వరకు తను ఈ సినిమాకు కమిట్ కాలేదని, ఉప్పెన సినిమాయే తెలుగులో చివరి సినిమా అని తెలుస్తోంది.
బన్నీ-సుకుమార్ కాంభినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.