తన విలక్షణ నటనతో కేవలం తమిళ ప్రేక్షకులనే కాదు ఇతర భాషల్లో కూడా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. ఇతర భాషల్లో విలన్ పాత్రలను వరుసగా ఒకే చెప్తున్న విజయ్… ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్స్‌కు గ్నీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆమిర్‌ఖాన్ లాల్ సింగ్ చద్దాలో నటిస్తోన్న ఈ హీరో, షాహిద్ కపూర్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి రెడీ అయ్యారు.
ఇప్పుడు ముచ్చటగా మూడో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన మా నగరం అనే సినిమా తెలుగులో నగరం పేరుతో విడుదలైంది. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకుడిగా మారి ‘మా నగరం’ బాలీవుడ్ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ బాలీవుడ్ రీమేక్‌లో సందీప్ కిషన్ పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తున్నాడట. ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.