అల వైకుంఠుపురములో సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ మెగా అభిమానులని ఖుషి చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ తో కలిసి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. చాలా రోజులు డిలే అయిన తర్వా రీసెంట్ గా ఈ మూవీ లాంచ్ కూడా అయ్యింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించడానికి ఓకే చెప్పాడు. అయితే 40 రోజుల షెడ్యూల్ కి మక్కల్ సెల్వన్ ఆరు కోట్లు డిమాండ్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. ఇందులో ఎంత వరకూ నిజముంది అనే విషయం పక్కన పెడితే, కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన విజయ్ సేతుపతి తమిళ్ లో 60 కోట్ల మార్కెట్ ఉంది. అతను ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే అందులో తప్పకుండా విషయం ఉంటుంది అనే నమ్మకం సినీ అభిమానుల్లో విజయ్ సేతుపతి కలిగించాడు. పాత్ర నచ్చితే భాషతో సంబంధం లేకుండా నటించడానికి రెడీ అయ్యే విజయ్ సేతుపతి, అల్లు అర్జున్ సినిమాలో నటించడం అంటే అది తప్పకుండా మూవీ మార్కెట్ పెరగడంలో హెల్ప్ అవుతుంది. సో ఆరు కోట్లు పెట్టి విజయ్ సేతుపతిని తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం అయితే కాదు.
ఇదిలా ఉంటే అసలు విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ లోకి ఎందుకు వచ్చాడు అని ఆరాతీస్తే… బన్నీ కోసం సుకుమార్ రాసిన కథ ఎర్రకాస్ట్ చేశాడు చందనం, స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుపతి ఏరియాలో ఉండే తమిళులు ఈ స్మగ్లింగ్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. కథలో తమిళ స్లాంగ్ తో మాట్లాడే పాత్రకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే, సుకుమార్… విజయ్ సేతుపతి లాంటి నోన్ ఫేస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సైరా సినిమాలో కూడా తమిళ తంబీ వీరపాండీగా కనిపించిన సేతుపతి, సొంత డబ్బింగ్ చెప్పుకోవడంతో తమిళ అతను తెలుగులో మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ సినిమా చూస్తున్న వారిలో కలిగింది. ఈ నాచురల్ ఎలిమెంట్ కోసమే సుకుమార్ విజయ్ సేతుపతిని కాస్ట్ చేసుకున్నాడు.