విజయ్ సేతుపతి… సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఈ పేరు చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా సన్నివేశానికి తగ్గట్టుగా నటించగల సత్తా ఉన్న నటుడు. రీసెంట్ గా ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను రాబడుతోంది.
తాజా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి కి మరో మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ఆ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో కూడా విజయ్ సేతుపతి చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారని సమాచారం. మొదట బాబి వేరొకరిని అనుకున్నప్పటికీ చిరు మాత్రం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సూచించాడట. ప్రస్తుతం విజయ్ సేతుపతి తో చర్చలు జరుగుతున్నాయట. మరి విజయ్ సేతుపతి ఒప్పుకుంటారో లేదో చూడాలి.