విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ సేతుపతి… తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రం కోసం అందరి చూపు విజయ్ సేతుపతి వైపే ఉంది. ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమాలోనూ విజయ్ సేతుపతి విలన్ రోల్ కు మంచి మార్కులు పడ్డాయి.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్ ఫ్రీ కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. దీంతో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ గా విజయ్ సేతుపతిని తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ నటనకు సరితూగే విలన్ గా విజయ్ సేతుపతి సరిపోతారని త్రివిక్రమ్ కూడా భావిస్తున్నారట. ఎన్టీఆర్ కూడా ఇందుకు సముఖంగా ఉన్నారని, కానీ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న సేతుపతి… డేట్స్ అడ్జెజెస్ట్ చేయగలరా అన్న టెన్షన్ పట్టుకుందని సమాచారం.