ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న స్థానిక ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చారు నటుడు విజయ్. స్టార్ హీరోగా ఉన్న విజయ్ ఓటు వేయడానికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీనితో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇది గమనించిన విజయ్ వెంటనే చేతులు జోడించి వారందరికీ క్షమాపణలు చెప్పాడు. దీనితో మరోసారి అభిమానుల మన్ననలు అందుకున్నాడు విజయ్. అంతే కాదు ఓటు వేయటానికి వచ్చిన విజయ్ చాలా సింపుల్ గా వచ్చాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది విజయ్ అభిమానులు కూడా సాధారణ ఎన్నికల్లో పోటీ లో ఉన్నారట. ప్రచారం సందర్భంగా కూడా అభిమానులు దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ (TVMI) జెండా,పేరును ఉపయోగించడానికి అనుమతి కోరినట్లు తెలుస్తోంది.
కాగా కొన్ని నెలల క్రితం, విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు, SA చంద్రశేఖర్, అతను సెక్రటరీ జనరల్‌గా, తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే, విజయ్ తన పేరును రాజకీయ అజెండాలో ఉపయోగించుకున్నందుకు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.