వారిసు తర్వాత విజయ్ నటిస్తున్న మూవీ దళపతి 67. కోలీవుడ్ లో ఎంతో హైప్ ఉన్న ఈ మూవీ నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఓ పెద్ద అప్‌డేట్ తో వచ్చారు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని వాళ్లు ఓ స్పెషల్ ప్రోమో ద్వారా చెప్పారు.
గతంలో విజయ్, త్రిష కలిసి నటించిన సినిమాల నుంచి హిట్ సీన్స్ ను ఈ ప్రోమోలో వాడారు. ఈ జోడీ 14 ఏళ్ల తర్వాత మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నట్లు మేకర్స్ చెప్పారు. దళపతి 67లో నటించే వాళ్ల గురించి రోజుకో అప్‌డేట్‌తో మేకర్స్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతున్నారు.
ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు మంగళవారం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.సంజయ్ దత్ తో పాటు గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, అర్జున్ సర్జా, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై భారీ ఎత్తున దళపతి 67ను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.