హీరో విజయ్ దేవరకొండ సంపాదన గురించి అందరికీ తెలిసిందే. సినిమా, సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నాడు ఈ హీరో. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే పాలసీని తూచ తప్పకుండా ఫాలో అవుతాడు. అయితే అలా సంపాదించిన డబ్బు నుంచి కొంత తన ఫ్యాన్స్ కోసం ఖర్చు పెడతాడు. చాలా మొత్తాన్ని ఛారిటీకి వెచ్చిస్తున్నాడు. ఇక మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని ఈమధ్య తను కొనుక్కున్న ఇంటిపై ఖర్చు చేశాడు దేవరకొండ.
ఇప్పుడీ హీరో మరోసారి ఇంటి ప్రయత్నాల్లో పడినట్టు తెలుస్తోంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు విజయ్ దేవరకొండకు ఆల్రెడీ పెద్ద ఇల్లు ఉంది. తల్లితండ్రి, తమ్ముడితో కలిసి ఆ ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు అది కాకుండా హైదరాబాద్ లోనే మరో పెద్ద ఇంటిని తీసుకునే ప్లాన్ లో ఉన్నాడు ఈ హీరో. కుదిరితే ఏదైనా ఇంటిని నేరుగా కొనేయడమో లేక దగ్గరుండి నిర్మించుకోవాలనే ఆలోచనలోనో ఈ హీరో ఉన్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా నాని కూడా ఇల్లు కట్టుకున్నాడు. తన అభిరుచికి తగ్గట్టు పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు. ఇండస్ట్రీలో దాదాపు అందరికీ సొంతిళ్లు, విల్లాలు ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఈసారి తన టేస్ట్ కు తగ్గట్టు, విభిన్నంగా పెద్ద ఇంటిని కట్టించుకోవాలని చూస్తున్నాడట.
కుదిరితే ఆ ఇంట్లోకే మకాం మార్చాలని కూడా అనుకుంటున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి.