సలీం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయ్ ఆంటోని. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో విజయ్ కు అంత క్రేజ్ రాలేదు. ఆ తరువాత వచ్చిన బిచ్చగాడు సినిమాతో మాత్రం మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అంతే విధంగా క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోని విజయరాఘవన్ అనే సినిమా చేస్తున్నాడు. కాగా నూతన సంవత్సర సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది.తెలుగు, కన్నడ, మలయాళ ,హిందీ భాషలలో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.
అయితే ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో విజయ్ ఆంటోని ఎమోషనల్ ట్వీట్ చేశాడు. విజయ రాఘవన్ టీజర్ మీకోసం..ఇది మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. చూసి మీ ప్రోత్సాహాన్ని షేర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రోత్సాహమే నాకు బలం. 2021 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది అంటూ విజయ్ ఆంటోని ట్వీట్ చేశాడు.
నా కొత్త చిత్రం
విజయరాఘవన్ టీజర్..మీ కోసం.. ఇది మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను…
చూసి మీ ప్రోత్సాహాన్ని షేర్,కామెంట్,లైక్ రూపం లో తెలియజేయండి..
మీ ప్రోత్సాహమే…నాకు బలం..
సమ్మర్ 2021 రిలీజ్..మీ
విజయ ఆంటోని#VijayaRaghavanhttps://t.co/8MtDm2L7XA— vijayantony (@vijayantony) January 2, 2021