హైదరాబాద్‌లో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి సర్జికల్ స్ట్రయిక్ అంటే టీఆర్ఎస్, ఎఐంఎం ఎందుకు ఆగమాగం అవుతున్నాయని విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ… పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా సూచించారు. అలా కాకుంటే నిజంగా ఎవరినైనా దాచిపెట్టినందువల్లే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని విజయశాంతి ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.