ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ , జనసేన పార్టీలు ఒకరు పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే వైసీపీ టార్గెట్ గా బీజేపీ ఎన్ని విమర్శలు చేసిన ఎక్కడ కూడా వైసీపీ నాయకులు ప్రతి విమర్శలు చెయ్యటం లేదు. విశాఖ లో మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ ప్రశ్నే ఎదురైంది. విలేఖరులు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే విజయ సాయి రెడ్డి తెలివిగా దాటవేశారు.
ఇది గమనించిన పాత్రికేయులు, విశ్లేషకులు మాత్రం బీజేపీ పై విమర్శలు చేస్తే ఏమవుతుందో విజయసాయిరెడ్డికి తెలుసుకాబట్టే తప్పించుకున్నారని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తప్పుడు మార్గం లో వెళ్తుందని, కేంద్రం లో బీజేపీ స్పందిస్తే తాము కూడా స్పందిస్తాము అంటూ ఎదో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ టార్గెట్ గా బీజేపీ ఎన్ని కామెంట్లు చేసినా నోరుమెదపటానికి వైసీపీకి కేసుల భయం అంటూ రాజకీయావర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు.