ఎవరు ఆడాలో.. ఎవరు ముందు రావాలో.. ఎవరు వెనక రావాలో.. అంతా ఆయనే డిసైడ్ చేస్తున్నాడు. అది కూడా ఆయన పక్క టీమ్ లో. ఎందుకంటే అక్కడ కెప్టెన్ ఈయన మాటే వింటాడు. ఆ కెప్టెన్ పైన మేనేజ్ మెంట్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి.. టీమ్ గెలవకుండా చేస్తున్నారు. బిజెపిలోకి ఎవరు రావాలో వద్దో కూడా విజయసాయిరెడ్డే డిసైడ్ చేస్తున్నాడు. సోము వీర్రాజు ఆయనకు తానా అంటే తందానా అంటూ.. సొంత పార్టీకే నష్టం చేస్తున్నాడు. ఉత్తరాంధ్రలో బిజెపి బలం పెరిగే ఛాన్స్ వచ్చినా వాటిని విజయసాయిరెడ్డి సలహాతోనే కాలదన్నుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి.. ఆయనొస్తే ఒక్కడే రాడు.. ఆయనతో చాలామంది బ్యాచ్ కూడా వస్తారు. అందుకే జగన్ వైసీపీలోకి తీసుకోవటానికి యాక్సెప్ట్ చేశాడు. కాని విజయసాయిరెడ్డి మాత్రం అడ్డం పడ్డాడు. కుదరదంటే కుదరదని తేల్చి చెప్పాడు. దానికి రకరకాల ఈక్వేషన్లు చెప్పి.. జగన్ నిర్ణయాన్ని సైతం వెనక్కు పెట్టించాడు. సరే వైసీపీ ఎటూ రానివ్వటం లేదు.. బిజెపిలోకి పోదామని గంటా డిసైడ్ అయ్యాడు. కాని విజయసాయిరెడ్డి అక్కడ కూడా బ్రేక్ వేయించాడు. సోము వీర్రాజు సైతం విజయసాయిరెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన లేదంటే లేదు అంతే. గంటాకు ఎక్కడా ఎంట్రీ లేకుండా చేయాలనేదే విజయసాయిరెడ్డి ప్లాన్.. అందుకు కారణం గంటా ప్రత్యర్ధి అవంతి శ్రీనివాసరావు.
ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విషయంలోనూ అదే తంతు నడుస్తోంది. లక్ష్మీనారాయణ బిజెపిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా.. సోము వీర్రాజు సెట్ చేయడం లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డిని జగన్ ని ఇద్దరి మీద కేసులు పెట్టి.. స్ట్రాంగ్ గా చార్జిషీట్లు పెట్టి.. ఇప్పటికే అవి వెంటాడేలా చేసిన లక్ష్మీనారాయణను కూడా ఎక్కడా అడుగు వేయనిచ్చే పరిస్ధితి లేదు. సామాజికవర్గం.. ప్రాంతం అన్నీ కలిసొస్తున్నా.. గంటాను, లక్షీనారాయణను ఇద్దరినీ దూరం పెడుతున్నాడు సోము వీర్రాజు. అధిష్టానం మాత్రం వీరిద్దరి గురించి సానుకూలంగానే ఉంది.
విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు వస్తే ఎలాంటి మార్పు వస్తుంది.. లక్ష్మీనారాయణ వస్తే ఎలాంటి బలం వస్తుంది.. అన్నీ తెలిసి కూడా.. వారిద్దరిని కాదనుకుంటున్నారంటే.. అంతటికీ కారణం విజయసాయిరెడ్డే. విజయసాయిరెడ్డి ఇన్ ఫ్లూయెన్స్ ఏపీ బీజేపీ మీద అంత బలంగా ఉందన్నమాట. ఒక సమాచారం ప్రకారం మాత్రం రాంమాధవ్ ఆల్రెడీ వీరిద్దరితో సంప్రదించారని.. త్వరలోనే ఆయనే స్వయంగా ఇన్ వాల్వ్ అయి.. వారిద్దరినీ బిజెపిలోకి చేర్చుకుంటారని తెలుస్తోంది.