విజయవాడ: యజమాని చంద్రబాబు, ఆయన ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు’ అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. అమరావతి విషయంలో ఇటీవల పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని చంద్రబాబు చెబుతుంటే, కాలం కలిసిరావడం వల్ల, ఈవీఎంల వల్లే వైసీపీ గెలిచిందని ఆయన పార్టనర్ అంటున్నాడని దుయ్యబట్టారు. అలాగైతే 23 సీట్లలో టీడీపీని, జనసేనను ఒకస్థానంలో ఎవరు గెలిపించారని ప్రశ్నించారు. తన లేటెస్టు ట్వీట్‌కు విజయసాయి ఈ ట్వీట్‌కు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ట్యాగ్ చేశారు.
యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనరేమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్‌నర్‌ను ఎవరు గెలిపించారో? @ncbn @PawanKalyan
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2019