చీకటి రోజుల గురించి చంద్రబాబు మాట్లాడితే విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ అరెస్ట్ గుర్తొస్తుందని విజయసాయిరెడ్డి అంటున్నారు. ముద్రగడను ఇంట్లో బంధించిన పద్దతిలోనే చంద్రబాబును కూడా బంధించామన్న అర్ధంలో ఆయన ట్వీట్ చేశారు. దళితుల కోసం బాబు పాదయాత్ర చెయ్యడం అన్యాయమని ఎద్దెేవా చేస్తూ.. దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న బాబు మాటల్ని విజయసాయి గుర్తుచేశారు. పల్నాడు పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై దేశం-వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది.