రాజధాని మార్పు పై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసినప్పటి నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా విశాఖలో రాజధాని పెట్టటానికి వీలు లేదంటూ నేవి అధికారులు అడ్డుచెప్పారని వస్తున్న వార్తపై విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ నాయకులు రాజధాని పై నేవి ని కూడా వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. నేవిని కూడా ఇలాంటి వివాదాల్లోకి లాగుతున్న టీడీపీ నాయకులతో పాటు మీడియాపై దేశ ద్రోహం కేసులు పెట్టాలని చెప్పుకొచ్చారు.
‘విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Advertisements