ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ, లేడీ అమితాబ్ అని పిలిపించుకున్న హీరోయిన్ విజయశాంతి. కమర్షియల్ హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హీరోలతో సమానంగా మార్కెట్ రేంజ్ సంపాదించుకున్నారు. సినిమాల్లో దాదాపు ఇరవై సంవత్సరాలు స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన విజయశాంతి, పదమూడు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్ధమై మహేశ్‌బాబుతో మూవీ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో విజయశాంతి అదిరిపోయే రీఎంట్రీ ఇస్తున్నారు.
ఈ జనరేషన్ హీరోయిన్లలో మీకు ఎవరంటే ఇష్టమని విజయశాంతిని ప్రశ్నించగా.. ఒక షాకింగ్ ఆన్సరిచ్చారు. ఇప్పుడున్న వారిలో ఎవరూ నచ్చలేదనేశారు. తనని అంతగా ఎవరూ ఇంప్రెస్ చేయలేదని చెప్పారు. ఇండస్ట్రీకి ఎందరో వస్తున్నారు కానీ, ఎవరికీ పని మీద ఫోకస్ లేదని అన్నారు. ఆరోజుల్లో తనలాంటి హీరోయిన్లు ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుండేవారని, ఏడాదికి దాదాపు పద్దెనిమిది సినిమాలు చేసేవారని, ఇప్పుడున్న వారు త్వరగా అలసిపోతూ ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయడమే గొప్పగా వుందని కామెంట్ చేశారు.