ఒకప్పుడు అగ్రశ్రేణి కథానాయికగా పేరొందిన విజయశాంతి… తరువాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలకు దూరం అయ్యారు. రాములమ్మకు పాలిటిక్స్ పెద్దగా కలిసిరాకపోవడంతో ఆమె మళ్ళీ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ మూవీతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక నుంచి విజయశాంతి పూర్తిస్థాయిలో సినిమాలు చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే… తను సినిమాల్లో నటించాలంటే ఈ లేడీ అమితాబ్ కండీషన్స్‌కు ఓకే చెప్పాల్సిందేనట. అలా అయితేనే సినిమా చేస్తానని తేగేసి చెప్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలో తనకు హీరోయిన్‌తో సమానమైన రెమ్యునరేషన్ తో పాటు, క్యారెక్టర్ విషయంలో కూడా కీలక రోల్ ఉండాలని కండిషన్ పెడుతున్నారట. వీటన్నింటికి ఒకే చెప్తేనే సినిమాలో నటిస్తానని లేదంటే నటించబోనని తనను సంప్రదిస్తున్న దర్శక, నిర్మాతలకు తేల్చి చెబుతున్నారట రాములమ్మ. అయితే విజయశాంతి పెట్టిన కండిషన్స్ ప్రతిసారి ఒప్పుకోవాలంటే కష్టమైన పనేనంటూ పెదవి విరుస్తున్నారు. పైగా తనతో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్స్ అంతా ఇప్పుడు తల్లి క్యారెక్టర్లు చేస్తున్నందున రాములమ్మ కోరికలను ఎంతమేరకు అంగీకరిస్తారో చూడాలి.