సినిమాల్లో లేడీ అమితాబ్ గా స్టార్ హీరోలకి సైతం చుక్కలు చూపించే స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ విజయశాంతి. ఈ లేడీ సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే పెద్ద సినిమాలు కూడా వాయిదా పడేవి అంటేనే అప్పట్లో ఆమె క్రేజ్ ఎంతో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అంతటి ఫాలోయింగ్ మైంటైన్ చేసే సమయంలోనే రాములమ్మగా మారి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి, సినిమాలవైపు రాలేదు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్లీ తెరపై కనిపించడానికి రెడీ అయిన విజయశాంతి, ఈ మూవీ కోసం భారీ పారితోషికం తీసుకుందట.
ఆమె రీఎంట్రీ కోసం ఎంత మంది ప్రయత్నించినా నో చెప్పిన విజయశాంతి, సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుంది. ఈ రోల్ కోసం ఆమె ఏకంగా 2 నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కే రెండు కోట్లు ఇవ్వడం జరుగుతుంది, అలాంటిది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ప్రొడ్యూసర్స్ అంత ఇచ్చారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయశాంతి రీఎంట్రీ కావడం, ఆమె పాత్ర చుట్టూ కథ నడవడం సినిమాకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కాబట్టే నిర్మాతలు వెనకాడలేదు. పైగా ఆన్ స్క్రీన్ విజయశాంతి ప్రెజెన్స్ స్టన్నింగ్ గా ఉంటుంది. మహేశ్, విజయశాంతి మధ్య వచ్చే సీన్స్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతాయని సమాచారం, ఇలాంటి సమయంలో ఆమెకి అంత రెమ్యునరేషన్ ఇవ్వడం తప్పుకాదు. అయితే ఈ సినిమా వరకూ ఇంత తీసుకుంది అంటే బాగానే ఉంది, మిగిలిన నిర్మాతలు విజయశాంతిని వాళ్ల సినిమాల్లో నటింపజేయాలంటే ఖర్చుతో కూడుకున్న పనే. అంత మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చి విజయశాంతికి అవకాశం ఇస్తారా అనేది ఆలోచించాల్సిన విషయమే. సో రీఎంట్రీకి ఎలాగూ రెడీ అయ్యింది కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో విజయశాంతి ఆచి తూచి అడుగులు వేయడం మంచిది. లేదంటే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవచ్చు.