సరిలేరు నీకెవ్వరూ టీమ్ దీపావళి కానుకగా విజయశాంతి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.చూపుల్లో రాజసం, కాళ్ళ మీద కాళు వేసుకుని కూర్చుని ఉన్న లుక్ తో అదరగొట్టింది విజయశాంతి. అయితే విజయశాంతి లుక్ చూసిన నెటిజన్ లు ట్రోల్ల్స్ మొదలు పెట్టేశారు. శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ ఫోటో ను, విజయశాంతి లుక్‌ను పోల్చుతున్నారు. ఇద్దరు వెటరన్ హీరోయిన్స్ లుక్ ఒకేలా ఉన్నాయని… అనిల్ రావిపుడి మారుతిని ఫాలో అయిపోయారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
కానీ రాములమ్మ కి రమ్యకృష్ణ కి చాల తేడాలు ఉన్నాయి. శైలజ రెడ్డి అల్లుడు సినిమా లో రమ్యకృష్ణ అదరగొట్టింది. మరి రాములమ్మ ఈ సినిమాతో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. విజయశాంతి 13 ఏళ్ల తరువాత ఈ సినిమాతో వెండితెర పై కనిపించబోతున్నారు.