లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకొని… అగ్రహీరోలతో పోటీ పడి అలరంచిన రాములమ్మ మళ్లీ మెకప్ వేసుకుంటున్నారు. సినిమాలకు విరామం ఇచ్చి, రాజకీయాల్లో ఫుల్ టైం రోల్‌లో ఉన్న రాములమ్మ ప్రిన్స్ మహేష్ నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత తనకు తగ్గ రోల్‌లో స్క్రీన్ మీద కనిపించబోతున్నారు.
రాయలసీమకు చెందిన పవర్ ఫుల్ పాత్రలో విజయశాంతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళికి రాములమ్మతో ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్-2తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్‌బాబు, గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న జంటగా రూపోందుతుంది సరిలేరు నీకెవ్వరూ సినిమా.
లాంగ్ బ్యాక్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న రాములమ్మ… సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.