రేపోమాపో బీజేపీలో చేరబోతున్న తెలంగాణ రాములమ్మ కేసీఆర్‌పై అంతెత్తున లేస్తున్నారు. అందరి ఆశల్ని ఆవిరిచేసి కేసీఆర్ దసరా పండగ చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయశాంతికి అంత ఆగ్రహం రావడానికి కారణం ఏంటంటే…

ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఆధిపత్య ధోరణితో వ్యవహరించడంతో సీఎం అసలు స్వరూపం బయటపడిందని విజయశాంతి అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమైన పండుగగా భావించే దసరా పండుగను ఆర్టీసీ సమ్మె కారణంగా బంధువులతో కలిసి జరుపుకోలేని దారుణ స్ధితికి కేసీఆర్ మొండి వైఖరే కారణమని చెప్పారు. అందరి ఆనందాన్ని ఆవిరి చేసి, తాను, తన కుటుంబం మాత్రం దసరా పండుగను జరుపుకోవాలనుకోవడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని ఆమె చెప్పారు.