ఎంఐఎం ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఆక్రమణల పేరుతో నిర్మించిన పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని అక్బరుద్దీన్ చేసిన డిమాండ్ పై తీవ్రంగా స్పందించారు.
ప్రజలంతా ఫుల్ ట్యాంక్ వాటర్ లెవల్ కు సమస్య ఉంది కాబట్టి తాజమహల్‌ను కూల్చాలని, ట్రాఫిక్‌కు అడ్డుగా ఉందని చార్మినార్‌ను కూల్చాలని డిమాండ్ చేయవచ్చు కదా అని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లు కూల్చమని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజలు ఎఫ్‌టీఎల్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని… ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్‌ను కూల్చాలని కూడా అనవచ్చు. ఈ విధమైన ప్రకటనలు అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించనవసరం లేదని అభిప్రాయపడుతున్నానంటూ విజయశాంతి తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు.