సంక్రాంతి బరిలో ఈ సారి ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ పోటీపడుతున్నారు. ఎవరా అనుకుంటున్నారా..! టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. మరో వైపు అల వైకుంఠపురంలో సినిమాతో టబు చాలా సంవత్త్సరాల తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాండురంగడు సినిమా తరువాత టబు టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు.
అత్తారింటికిదారేది సినిమాతో నదియాని, అజ్ఞాతవాసి సినిమాతో ఖుష్బూని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడు తాజాగా అల వైకుంఠపురంలో సినిమాతో బన్నీకి తల్లిగా టబు ని పరిచయం చెయ్యబోతున్నాడు త్రివిక్రమ్. అటు 13 సంవత్త్సరాల లాంగ్ గ్యాప్ తరువాత లేడీ అమితాబ్ విజయశాంతిని సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ పవర్ క్యారెక్టర్ లో చూపించనున్నాడు అనిల్ రావిపూడి. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. మరి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ ఇద్దరు సీనియర్స్ సంక్రాంతిని ఎవరు గ్రాండ్ గా జరుపుకుంటారో చూడాలి.