ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. కోర్టు వేసిన ప్రశ్నల దెబ్బకు కేసీఆర్ ఇరకాటంలో పడ్డారని… కేసీఆర్ పంథం నెగ్గించుకోవడానికి హుజూర్‌నగర్ ప్రజలకు మొండి చెయ్యి చూపించబోతున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ సమ్మెపై సర్కార్ వాదన చూస్తుంటే.. రాబోయే రోజుల్లో కేసీఆర్ హమీలేవీ అమలయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం కనీసం 47కోట్ల నిధులు కూడా లేవంటున్నారని, కానీ హుజూర్‌నగర్‌లో 100కోట్ల హమీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారని కోర్టు నిలదీసిన అంశాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుకు అబద్ధమైన చెప్పామని ఒప్పుకోవాలి, లేదంటే హుజూర్‌నగర్ హమీలు ఉత్తివే అని ఒప్పుకోవాలని అన్నారు.