విజయవాడలోని కరోనా కేర్ సెంటర్‌లో జరిగిన ప్రమాదంపై కేసు నమోదైంది. స్వర్ణ ప్యాలెస్‌లో కరోనా కేర్ సెంటర్ నిర్వమిస్తున్న రమేష్ ఆస్పత్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలున్నాయని ముందే తెలిసినా .. అధిక ఖర్చు అవుతుందనే కారణంతో రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం వహించారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లిందని ప్రస్తావించారు. ఈ మేరకు 304(II),308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఫైర్ సెఫ్టీ నిబంధనలు సరిగా లేవని అధికారులు చెప్తున్నారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం అలారం కూడా మోగలేదని వారంటున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత ప్రమాదానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.