విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. విచారణలో భాగంగా కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతకు నోటీసులు అందాయి. తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసుల్లో ఆదేశించారు.
కొద్ది రోజుల క్రితమే కరోనా బారినపడిన డాక్టర్ మమత.. ఇటీవలే కోలుకుని హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. విచారణకు హాజరయ్యే విషయంలో ఎలాంటి మినహాయింపులు లేకపోవడంతో… ఆమె నేడు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లనున్నారు.. అయితే అగ్ని ప్రమాదం ఘటనకు.. రాయపాటి కుటుంబానికి సంబంధమేంటన్నది ఆసక్తికరంగా మారింది.