నిద్ర లేస్తూనే విజయవాడ ఉలిక్కిపడింది. కరోనా కేర్ సెంటర్‌గా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. తొలుత గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో మంటలు అలముకున్నాయి. ఆ తర్వాత ఇవి ఇతర అంతస్తులకు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియక అందులో ఉన్నవారంతా ప్రాణభయంతో కేకలు వేశారు. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు.. ఒకటో అంతస్తు నుంచి కిందకి దూకేశారు.మరికొందరిని కిటికీ అద్దాలను పగలగొట్టి.. నిచ్చెన సాయంతో పోలీసులు కిందకు తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం తర్వాత ఆస్పత్రి పరిస్థితి ఇది…