ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని భాషలలో ఆయన కథలు ఇచ్చి మంచి హిట్ లు కొట్టారు. బాహుబలి సినిమాకు సైతం ఆయన కథ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హాలీవుడ్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్ళిన మాట వాస్తవం. ఇక మన తెలుగులో ఎందరో స్టార్ హీరోలు ఆయన్ను కథలు అడుగుతూ ఉంటారు.
ఆయన కూడా కథల విషయంలో ఇప్పుడు కాస్త కమర్షియల్ గానే వ్యవహరిస్తున్నారు అనే టాక్ వినపడుతుంది. బాహుబలి సినిమా సమయంలో ఆయన బజరంగి భాయ్ జాన్ అనే కథ చెప్పారు. ముందు అమీర్ ఖాన్ కి ఈ కథ చెప్పగా ఆయన రిజెక్ట్ చేసారట. దీనితో సల్మాన్ ఖాన్ కు వెళ్లి ఈ కథ చెప్పగా ఆయనకు కథ బాగా నచ్చింది. వెంటనే ఒక బడా నిర్మాతకు కథ చెప్పమని చెప్పారట.
ఆయనకు కథ నచ్చడంతో 20 లక్షలు ఇస్తామని చెప్పారట. విజయేంద్ర ప్రసాద్ నో అనడంతో మరో 20 లక్షలు ఇస్తామని అన్నారట. ఇది వందల కోట్లు వసూలు చేసే సినిమా నేను 2 కోట్లకు రూపాయి తగ్గినా ఇవ్వను అని వచ్చేశారట. ఆ విషయం సల్మాన్ కు తెలియడంతో మరో నిర్మాతకు కథ చెప్పమని అన్నారట. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే రెండు కోట్లు ఇచ్చేసి కథ తీసుకున్నారట.