వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.. దోమ మండలం దోర్నాల్ పల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఉన్న స్మశాన వాటిక ,డంపింగ్ యార్డ్, పాఠశాల, పల్లె ప్రకృతి వనం లను పరిశీలించారు.
అయితే పల్లె ప్రకృతి వనంలో 30 వేల మొక్కలు ఎండిపోయాయి. దీంతో ఇందుకు కారణమైన విలేజ్ సెక్రటరీ సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అంతే కాదు మొక్కలు ఎండిపోవడానికి నిర్లక్ష్యం వహించిన ఎండిఓ ,ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్ లపై పెనాల్టీ విధించారు ఆయన.
మండలంలోని గ్రామ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు. పెనాల్టీలు ప్రభుత్వానికి కట్టాలని.. లేకపోతే సస్పెండ్ చేస్తానన్నారు. మళ్లీ త్వరలోనే దోమ మండలాన్ని తనిఖీ చేస్తానని..జాగ్రత్తగా అందరూ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.