హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం చేవెళ్ల టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గాయపడ్డారు. Ts 34.B.4545 వాహనంలో హైదరాబాద్ నుంచి వస్తుండగా ఎదురుగా వచ్చిన కార్ ts 07 Fu 2347 ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మహేష్ రెడ్డి గాయాలతో బయటపడ్డారు. మహేష్ రెడ్డిని వెంటనే హైదరాబాద్ హాస్పిటల్‌కు తరలించారు.