ప్రభాస్ సినిమా అంటే ఆ రేంజ్ వేరు. హిట్, ఫ్లాప్ తేడా లేకుండా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో. ప్రభాస్ హీరో అంటే మినిమం గ్యారెంటి హిట్ ఉంటుందని ప్రొడ్యూసర్స్ అంతా నమ్ముతారు. ఇక బాహుబలి మూవీతో తన మార్కెట్‌కు బాలీవుడ్‌కు సైతం విస్తరించుకున్న ప్రభాస్‌కు హిందీలోనూ ఆఫర్స్ వచ్చినా పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ పాన్ ఇండియా లెవల్ తెలుగు సినిమాలపై ప్రభాస్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే, ప్రభాస్ మార్కెట్‌తో పాటు తన నటన అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న భావనతో క్వీన్ మూవీ దర్శకుడు వికాస్ భల్… ప్రభాస్‌ను కలిసినట్లు తెలుస్తోంది. మొత్తం దట్టమైన అడవుల్లో ఉండే ఈ సినిమా కథకు ప్రభాస్ కూడా దాదాపు ఓకే చెప్పేశాడట. రెండు, మూడు సార్లు వికాస్, ప్రభాస్‌లు సినిమా స్క్రిప్ట్‌పై ఓ నిర్ణయానికి వచ్చాక, సినిమాల్లో ఫైట్స్ కోసం ప్రభాస్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ కథలో ఫైట్స్‌కు పెద్దగా ఆస్కారం లేకపోవటం, అలాగని ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఫైట్ సీన్స్ క్రియేట్ చేసే ఉద్దేశం లేని ఈ క్వీన్ సినిమా డైరెక్టర్ ప్రభాస్‌తో సినిమానే డ్రాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫైట్స్ కోసం మంచి క్రియేటివ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా వద్దనుకోవటం తెలుగు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.