మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. తెలుగులో మల్లీశ్వరీ సినిమాలో యువరాణిగా ఎందరో మనసులు దోచిన ఈ సుందరి తరువాత తెలుగు తెర మీద ఒకే ఒక్క సినిమా చేసి, బాలీవుడ్ లో బిజీ అయిపోయింది ఈ భామ..!
ఈ మధ్యనే హీరో విక్కి కౌశల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించి మెరిశారు.
చేయిచేయి పట్టుకుని మరీ..ఎయిర్ పోర్ట్ లోనికి వెళ్లారు.అయితే జులై 16న కత్రినా తన 39 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అందుకే తన భార్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు విక్కీ కత్రినాతో కలిసి మాల్దీవులకు వెళ్లారు.
మాల్దీవుల్లో వెకేషన్‌కు వెళ్తూ వారిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటబడ్డారు. అంతేకాదు.,. మాల్దీవులు తన ఫేవరెట్ స్పాట్ అని కత్రినా ఇంతకు ముందే చెప్పారు. అందుకే కైఫ్ భర్త విక్కీ అదే ప్లేస్‌లో తన భార్య కత్రినా బర్త్ డే జరపాలని ఫిక్స్ అయ్యారు.