రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమార్కుడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇందులో రవితేజ సరసన అనుష్క హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఓ సినిమా రానున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ ను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారట.
అలాగే సీక్వెల్‌కు సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం…ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.