ఏ ముహూర్తాన విక్రమ్ సినిమా థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారో కానీ నిర్మాతలు భారీ లభాలు కళ్లజూస్తున్నారు. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, మరికొంతమందితో కలిసి ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడు రెట్టింపు లాభాలు అందుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం, విక్రమ్ సినిమాను 6 కోట్ల రూపాయలకు కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు 13 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చిందన్నమాట. అలా వందశాతం లాభాలు అందుకున్నారు బయ్యర్లు, నిర్మాతలు. అటు షేరింగ్ కింద సినిమాను ఇచ్చిన కమల్ హాసన్ కు కూడా లాభాలు వచ్చి పడుతున్నాయి.
ఇప్పటివరకు ఈ సినిమాకు ఆంధ్రా నుంచి 5 కోట్ల 60 లక్షలకు పైగా వసూళ్లు వచ్చాయి. అటు నైజాం నుంచి 5 కోట్ల 53 లక్షలు, సీడెడ్ నుంచి 2 కోట్ల 5 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం బ్యాక్ బోన్ గా నిలిచింది.