స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆస్పత్రిలో చేరడంతో అనేక కథనాలు వడ్డి వార్చేసింది మీడియా. గుండెపోటు వచ్చిందని.. సీరియస్ గా ఉందని.. ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారని అనేక వార్తలు వచ్చాయి. అంతేకాదు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా కథనాలు హల్చల్ చేశాయి.
ఈ వార్తలతో ఆయన అభిమానులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విక్రమ్ కు ఏమైందో.. ఎలా ఉన్నారో అంటూ తెగ కంగారుపడ్డారు. సోషల్ మీడియాలో వరుసబెట్టి ఆయన క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఈ క్రమంలోనే విక్రమ్ ఆరోగ్యంపై ఆయన మేనేజర్ సూర్య నారాయణన్ క్లారిటీ ఇచ్చారు.
విక్రమ్ కు గుండెపోటు అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు. అదంతా ఫేక్ అని వివరించారు. ఇటు ఆస్పత్రి వర్గాలు కూడా బులిటెన్ విడుదల చేశాయి. విక్రమ్ కి ఛాతీలో తేలికపాటి అసౌకర్యం కలిగింది. కొద్ది గంటల్లోనే డిశార్జ్ అవుతారు’ అని తెలిపాయి.
ఎవరూ వదంతులు నమ్మొద్దని విక్రమ్ మేనేజర్ స్పష్టం చేశారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఆరోగ్యంగా బయటకు రావాలని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.