తమిళ్ ఇండస్ట్రీలో 2017 సంవత్సరానికి గాను మంచి విజయం సాధించిన సినిమా ‘విక్రమ్ వేద’. పుష్కర్ గాయాత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాను తెలుగు రీమేక్ చెయ్యాలని గతంలో అల్లు అరవింద్ భావించాడట. ప్రధాన పాత్రల్లో రానా, రవితేజ పేర్లు కూడా అనుకున్నారట. కానీ కొన్ని అనూహ్య కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.
అల్లు అరవింద్ మరోసారి ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనకు వచ్చాడట. అయితే ఈ సారి మాధవన్ పాత్రలో రాంచరణ్ ను పెట్టాలని భావిస్తున్నాడట. మరి విజయ్ సేతుపతి పాత్రలో రానాను పెడతారా లేక రవితేజను పెడతారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను 2022 లో పట్టాలెక్కించే అవకాశం ఉందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.