తెలుగు సినిమా చరిత్రతో పాటు హీరో రవితేజ కెరీర్ లో విక్రమార్కుడు బిగ్గెస్ట్ హిట్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమా అన్నీ భారతీయ భాషల్లోకి అనువదించగా… ప్రతి చోట హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అన్న చర్చ మొదలైనా ఎవరూ స్పందించలేదు.
కానీ విక్రమార్కుడు సీక్వెల్ స్ర్కిప్ట్ ను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే రాజమౌళి చాలా మూవీలకు కమిట్ అయి ఉండటంతో… ఈ సినిమాను ఆయనే చేస్తారా, తన శిష్యుల్లో ఒకరికి ఇచ్చి చేయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తీసుకరావాలని… పర్యవేక్షణ బాధ్యతలను రాజమౌళికే అప్పజెప్పాలని రవితేజ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.