ఓవైపు చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే, మరికొన్ని సినిమాలు థియేట్రికల్ సిస్టమ్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సుమంత్ హీరోగా నటించిన మళ్లీ మొదలైంది సినిమా త్వరలోనే ఓటీటీలో డైరక్ట్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇప్పుడిదే బాటలో విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కూడా వస్తోంది.
విక్రమ్ కెరీర్ లో 60వ సినిమా మహాన్. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో మరో పెద్ద ప్రత్యేకత ఉంది. హీరో విక్రమ్, తన కొడుకు ధృవ్ తో కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. అలా తండ్రికొడుకులు కలిసి నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
ఫిబ్రవరి 10న మహాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. కన్నడ మినహా అన్ని భాషల్లో మహాన్ అనే టైటిల్ తోనే వస్తోంది. కన్నడలో మాత్రం మహాపురుష అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
కొన్నాళ్లుగా ఫ్లాపులిస్తున్నాడు విక్రమ్. తమిళనాట అతడికి థియేట్రికల్ మార్కెట్ పడిపోయింది. దీనికితోడు కరోనా వల్ల కోలీవుడ్ థియేట్రికల్ వ్యవస్థ అతలాకుతళమైంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి క్రేజీ ఆఫర్ రావడం, వెంటనే ఓకే చేసేయడం చకచకా జరిగిపోయాయి. రీసెంట్ గా జగమే తంత్రం సినిమాతో ఫ్లాప్ అందుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు కూడా ఈ సినిమా కీలకంగా మారింది,