సీనియర్ కన్నడ నటుడు సుదీప్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం విక్రాంత్ రోణ. తొలి రోజు ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరి ఆ తర్వాత సంగతేంటి? సినిమా రిజల్ట్ ఏంటి.. దీనికి కలెక్షన్లు కొలమానం. విక్రాంత్ రోణ సినిమా 3 రోజుల కలెక్షన్ ఏంత?
వసూళ్ల పరంగా విక్రాంత్ రోణ సూపర్ హిట్టయింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఎందుకంటే, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కోటీ పాతిక లక్షల రూపాయల బిజినెస్ చేసింది. 3 రోజుల్లో కోటి 91 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అంటే ఖర్చులు పోను, 40 లక్షలకు పైగా లాభం వచ్చినట్టే లెక్క. కాబట్టి విక్రాంత్ రోణ సినిమా హిట్టయినట్టే
అయితే, వరల్డ్ వైడ్ చూసుకుంటే, ఈ పరిస్థితి కనిపించడం లేదు. 55 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. బిజినెస్ మాత్రం అటుఇటుగా 90 కోట్ల రూపాయలు చేసింది. వాస్తవానికి 3 రోజుల్లో రూ.70 కోట్లు ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనేది సందేహాత్మకం.
మరోవైపు నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కన్నడ వెర్షన్ కు సంబంధించి శాటిలైట్-డిజిటల్ రైట్స్ జీ గ్రూప్ దగ్గరున్నాయి. ఇప్పుడు తెలుగు, తమిళ బిజినెస్ స్టార్ట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, తమిళ శాటిలైట్-డిజిటల్ డీల్ క్లోజ్ అయింది. రేపోమాపో తెలుగు వెర్షన్ డీల్ కూడా క్లోజ్ అయ్యేలా ఉంది.