ఒకవైపు వచ్చే ఎన్నికలు సిద్దమవుతూనే… మరోవైపు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. భారతీయుడు-2 సినిమా షూట్ ఆగిపోయిన తర్వాత కమల్… లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాను చేస్తున్నారు.
నగరం, ఖైదీ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనకరాజ్… తన మాస్టర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పుడు విక్రమ్ లో విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫాహిద్ ఫాజిల్ విలన్‌గా నటించడం కొత్తేమీ కాకపోయినా కమల్ వంటి హీరో సినిమాలో ఫాహిద్ నటించడం తనకు కూడా ఓ కొత్త ఎక్స్‌పీరియెన్సేనని చెప్పొచ్చు. ఈ మూవీని తమిళ్, తెలుగు,మలయాళంలో రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు.