మెట్ పల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయితీ అయిన జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ..జగ్గసార్ పరిసర గ్రామాల ప్రజలు మెట్ పల్లిలోని పాత బస్టాండ్ దగ్గర ధర్నాకు దిగారు.
ఇక అన్ని రంగాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నా.. జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గత వంద రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, జగిత్యాలలో బుధవారం జరిగిన సీఎం సభలో జగ్గా సాగర్ గ్రామం ప్రస్తావనే తీయలేదంటూ జగ్గాసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలన్నారు.
లేదంటే పరిసర గ్రామాలతో కలిపి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తామంటూ.. స్థానిక ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్తేనే ధర్నా విరమిస్తామని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ అక్కడికి చేరుకొని.. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని.. తప్పని సరిగా న్యాయం జరగేట్టు చూస్తానని గ్రామస్తులకు హమీ ఇవ్వడం వాళ్లు వెనక్కి తగ్గారు.