సినిమాల్లో అవకాశం రావడమే చాలా కష్టం. పేరు రావడమంటే పెద్ద విషయం. తొలుత వస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తద్వారా మరో అవకాశానికి పునాది వేసుకోవడం కొనసాగుతూ ఉంటుంది.
సడన్ గా ఏదో ఒక క్యారెక్టర్ లేదా అవకాశం సదరు నటుల కెరీర్ ని మలుప్పుతుంది. దీంతో హీరోలు విలన్లు అవుతారు. విలన్లు కమెడియన్లు అవుతారు. కమెడియన్లు విలన్లు అవుతారు.
అలా మొదట్లో విలన్ గా చేసి ఆ తరువాత మంచి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన వారు ఉన్నారు వారెవరో ఒకసారి తెలుసుకుందాం.నటుడు జీవా మొదట్లో వరుసగా విలన్ వేషాలు వేసి తరువాత నెమ్మదిగా కమెడియన్ గా టర్న్ అయ్యారు. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమా తో సడన్ గా కమెడియన్ గా మారిపోయారు.
అలా అప్పటి నుంచి చాలా సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీ గా తన కెరియర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు జయప్రకాష్ రెడ్డి అప్పట్లో మొత్తం విలన్ పాత్రలు వేసేవాడు ముఖ్యం గా ఆయన్ని సమరసింహా రెడ్డి సినిమాలో చూస్తే అందరూ బయపడిపోయెలా విలనిజాన్ని పండిస్తూ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తరువాత వచ్చిన కొన్నిసినిమాల్లో కమెడియన్ గా చేస్తూ బాగా క్లిక్ అయ్యారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిక్, ఉసరవెల్లి లాంటి సినిమాలతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.
ఇక ప్రస్తుతం ఆయన మన మధ్యన లేరు అనే ఒక భాద సినిమా అభిమానులని కలిచి వేస్తుంది ఆయన లాంటి మంచి ఆర్టిస్టు ని కోల్పోవడం సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి.
Also Read: ఇండియాలో హిట్టైన ఇన్ స్పైర్డ్ పోస్టర్స్ …!?