మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సినిమా జానర్ ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ప్రశ్నలు వదిలారు మేకర్స్. ఆ క్యూరియాసిటీని మరింత పెంచుతూ, సినిమా జానర్ ఏంటనే విషయాన్ని చెప్పకుండానే టీజర్ ను రిలీజ్ చేశారు.
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ లో అన్ని జానర్లు కనిపిస్తున్నాయి ఫ్యామిలీ, ఎమోషన్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్.. ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీజర్ లో హీరోతో కూడా చెప్పించారు. అయితే సినిమా ఏ జానర్ కు చెందిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అదే గమ్మత్తు.
కిరణ్ అబ్బవరం సరనస కష్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చేనెల 17న సినిమా థియేటర్లలోకి వస్తోంది. జీఏ2 బ్యానర్ కు ఈ సినిమా కీలకం.