భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ 1988 బ్యాచ్ కు చెందిన వారు.
హర్షవర్దన్ శ్రింగ్లా శనివారం పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో వినయ్ మోహన్ పదవి చేపట్టారు. అంతకు ముందు ఆయన నేపాల్ లో భారత రాయబారిగా పనిచేశారు.
‘ భారత విదేశాంగ కార్యదర్శిగా వినయ్ క్వాత్రా నేడు ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
రాయబారిగా ఆయనకు 32 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ఆయన ప్రధాన మంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా రెండేండ్ల పాటు పనిచేశారు.