హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాపై కారుమబ్బులు కమ్ముకోవడంతో, పవన్ ఇప్పుడు మరో సినిమాపై ఫోకస్ పెట్టాడు. వినోదాయ శితం రీమేక్ ను అతడు టేకప్ చేస్తాడని అంతా అనుకున్నారు. ఈ మేరకు త్రివిక్రమ్ అన్నీ సెట్ చేసి పెట్టినట్టు కూడా కథనాలు వచ్చాయి.
వినోదాయ శితం రీమేక్ కు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు త్రివిక్రమ్. భీమ్లానాయక్ తరహాలో కథను మార్చడంతో పాటు.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు. అలా మొత్తం సెట్ చేసి, ప్రాజెక్టును సముద్రఖని చేతిలో పెట్టాడు. అతని దర్శకత్వంలో పీపుల్ మీడియా బ్యానర్ పై, జీ స్టుడియోస్ సమర్పణలో సినిమా రావడమే ఆలస్యం.
అంతలోనే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎందుకో, ఉన్నఫలంగా ఈ సినిమా స్టార్ట్ చేయడానికి పవన్ సముఖంగా లేడు. లెక్కప్రకారం, ఈనెలలో మూవీ ప్రారంభం కావాలి. కానీ సెప్టెంబర్ వరకు ప్రాజెక్టును పోస్ట్ పోన్ చేయాలని కోరాడట పవన్.
పవన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్. కాల్షీట్లన్నీ పూర్తిగా ఈ సినిమాకే కేటాయించాడు. రాబోయే 2 నెలల్లో ఆ సినిమాను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. బహుశా, ఈ సినిమా కోసమే వినోదాయశితం రీమేక్ ను వాయిదా వేసినట్టు కనిపిస్తోంది.