దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. రోజుకో చోట మహిళలపై అఘాయిత్యం జరిగినట్టు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిని మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది.
బాచుపల్లి పరిధిలో ఓ యువతిపై స్నేహితుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 13న ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలను జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో ఏర్పాటు చేశారు. అయితే.. ఆ వేడుకలకు సదరు యువతి హాజరైంది. బర్త్ డే వేడుకలు ముగించున్న తర్వాత ఆ యువతి ఇంటికి బయలుదేరింది.
కాగా.. అదే వేడుకకు హాజరైన తన స్నేహితులు తనను ఇంటి దగ్గర దించుతానని నమ్మబలికారు. తన స్నేహితులే కావడంతో వారితో ఇంటికి వచ్చింది. అప్పటికే నిద్ర మత్తులో ఉన్న సదరు యువతిపి తన ఇంట్లోనే దాడికి పాల్పడ్డాడు.
వెంటనే నిద్రలో నుండి తేరుకున్న యువతి.. గట్టిగా అరవడంతో పారిపోయాడు. బాధితురాలి పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.