పౌరసత్వ చట్టంపై ఢిల్లీలో మరోసారి హింస చెలరేగింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకగా సీలంపురిలో సోమవారం మధ్యాహ్నం నిసననలు కొనసాగాయి. నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరగడంతో ఓ పోలీస్ పికెట్ ను, స్కూల్ వ్యాన్ ను నిరసన కారులు తగులబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. నిరసనకారులు పలు బస్సులు, కార్లను ధ్వంసం చేశారు.
నగరంలోని ప్రధాన కూడలి అయిన సీలంపురి లో నిరసనకారులంతా గుమికూడి ర్యాలీ తీశారని…నిరసనకారులు బస్సులను టార్గెట్ చేయడంతో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో నిరసనకారులు రాళ్లు రువ్వారని పోలీసులు చెప్పారు.