కరోనా టైమ్ లో సోనూసూద్ సేవలు మరువలేనివి. ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ఒకడే విపుల్ మిరాజ్కర్.
మహారాష్ట్రకు చెందిన విపుల్.. ఖాళీ ప్రదేశంలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సోనూసూద్ చిత్రాన్ని రూపొందించాడు. ఇది తయారు చేయడాని అతనికి 20 రోజుల సమయం పట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా ద్వారా పంచుకున్నారు విపుల్. దానిని షేర్ చేసిన సోనూసూద్… తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.
ఇక మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు సోనూసూద్. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ కు భారత్ తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. దీనిపై స్పందించిన ఆయన.. ఎంతో గర్వంగా ఉందని.. ఇది తనకెంతో ప్రత్యేకమని ట్వీట్ చేశాడు.
Feeling proud today as I'm chosen to be the Brand Ambassador for India at the #SpecialOlympics going to be held in Russia! I'm sure our champions will make us proud and I wish them all the best!
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/9MxfE3UDSP
— sonu sood (@SonuSood) August 2, 2021